22/10/2026, Thursday · 01:05:56 PM About UsPrivacy PolicyContact Us
Bharath Darpan

యువ ఫిలిం మేకర్లను అభినందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Ramanjineyulu 17/10/2026 11:10 PM సినిమా 31

యువ ఫిలిం మేకర్లను అభినందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Want this news as a newspaper clip?Print News Clip

యువ ఫిలిం మేకర్లను అభినందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

వాతావరణ మార్పులు, నీటి సంక్షోభంపై చైతన్యం కలిగించే లఘు చిత్రాలు రూపొందించాలి

హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో నిర్వహించిన బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్ ఛాలెంజ్ అవార్డ్స్–2026 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు యువ ఫిలిం మేకర్లను అభినందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాతావరణ మార్పులు, నీటి సంక్షోభం, ప్రకృతి పరిరక్షణ వంటి కీలక అంశాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించేలా యువ దర్శకులు, ఫిలిం మేకర్లు లఘు చిత్రాలను రూపొందించాలని పిలుపునిచ్చారు. సమాజంలో మార్పు తీసుకురావడంలో సినిమాలు, లఘు చిత్రాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.

బతుకమ్మ పండుగ సామాజిక న్యాయం, సమానత్వానికి ప్రతీకగా నిలుస్తుందని ఆయన వివరించారు. యువతలో దాగి ఉన్న సినీ ప్రతిభను వెలికితీసి, వారిని ప్రోత్సహించడం ద్వారా హైదరాబాద్‌ను భారతీయ సినిమా రంగానికి ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి :: జగన్నాధపురంలో ఎల్‌నినో ప్రభావంపై అవగాహన సదస్సు

young filmmakersDeputyBhattiVikramarkacongratulates

About the author

R

Ramanjineyulu

Chairman

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

37 Posts

Latest News

చిన్నారి ఈషా రాజ్ జన్మదిన వేడుకల్లో హరిత సందేశం ఇద్దరు కల్నల్స్ భార్యలతో ఎఫైర్.. మేజర్‌పై వేటుకు సిద్ధమైన ఆర్మీ! దుర్గా యూత్ ఆధ్వర్యంలో ఘనంగా మహా అన్నదానం భక్తులకు అన్నప్రసాదం అందించిన సర్పంచ్ నారగాని రాంబాయి జగన్నాధపురంలో ఎల్‌నినో ప్రభావంపై అవగాహన సదస్సు కేఫ్‌ మజాలో ధరలపై ఆరోపణలు! భూమి శిస్తుపై మంత్రి పొంగులేటి ప్రకటనతో రైతుల్లో ఆందోళన జిమ్ తర్వాత ఖరీదైన ప్రొటీన్ పౌడర్లు అవసరం లేదు.. ఇవే బెస్ట్ ఫుడ్స్! షుగర్ ఉన్నవారు ఉపవాసం చేయొచ్చా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! చిన్నారుల్లో నాలుగు రెట్లు పెరిగిన ఊబకాయం.. 17 కోట్ల మందికి పైగా బాధ! రోజూ వ్యాయామం చేస్తున్నా ప్రమాదమేనా? గంటల తరబడి కూర్చుంటే క్యాన్సర్ ముప్పు!