అమెరికాలోని ప్రవాస ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న పెద్ద సంస్థలలో ఒకటైన 'టంటెక్స్' (TANTEX - Telugu Association of North Texas) సరికొత్త మైలురాయిని చేరుకుంది. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న టంటెక్స్, అప్రతిహతంగా 40 వసంతాల వేడుకలను జరుపుకుంటోంది!
ఒకే రోజు అట్లతద్ది వేడుకలు, తెలుగు సాహిత్య వేదిక 19వ వార్షికోత్సవం, మరియు ప్రఖ్యాత సంగీత దర్శకులు కోటి గారి ఆధ్వర్యంలో అద్భుతమైన 'మ్యూజికల్ లైవ్ కాన్సర్ట్'... ఇలా మూడు మహా వేడుకలతో టెక్సాస్ గడ్డపై తెలుగు పండుగ సందడి నెలకొంది.