23/10/2026, Friday · 05:27:06 PM About UsPrivacy PolicyContact Us
Bharath Darpan

తీన్మార్ మల్లన్న బీసీ రాజ్యాధికార యాత్ర

T Ramanjaneyulu 23/10/2026 4:14 PM రాష్ట్ర వార్తలు 3

తీన్మార్ మల్లన్న బీసీ రాజ్యాధికార యాత్ర
Want this news as a newspaper clip?Print News Clip

హైదరాబాద్, అక్టోబర్ 23: తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కి భువనగిరి జిల్లా అధ్యక్షులు కొమిరిశెట్టి నర్సింహులు ఆధ్వర్యంలో జిల్లా పార్టీ నాయకులు, కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిసి దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే బీసీల రాజకీయ సాధికారత, సామాజిక న్యాయం, రాజ్యాధికార సాధనే లక్ష్యంగా చేపట్టిన బీసీ రాజ్యాధికార యాత్రను 31 రోజుల పాటు విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల హక్కుల సాధన కోసం,బీసీల రాజకీయ చైతన్యం కోసం తీన్మార్ మల్లన్న చేస్తున్న పోరాటం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. గ్రామగ్రామాన పర్యటిస్తూ బీసీ రాజ్యాధికార ఆవశ్యకతను ప్రజలకు వివరిస్తూ, సామాజిక న్యాయం కోసం మల్లన్న చేస్తున్న కృషి అభినందనీయమని తెలిపారు.

రాబోయే రోజుల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేస్తామని, బీసీ రాజ్యాధికార సాధనే లక్ష్యంగా మల్లన్న నాయకత్వంలో ఐక్యంగా ముందుకు సాగుతామని నాయకులు స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో భువనగిరి జిల్లా ఉపాధ్యక్షురాలు ఉషా కీర్తి, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు పాంగాల కిష్టయ్య, జిల్లా కార్యదర్శి మోతుకుపల్లి రఘు, జిల్లా నాయకులు రాజనర్సయ్య గౌడ్, ఆలేరు యూత్ వైస్ ప్రెసిడెంట్ సంగు రాజు, భువనగిరి మండల మహిళా అధ్యక్షురాలు రోజా రాణి,తుర్కపల్లి మండల అధ్యక్షులు గోనె కృష్ణా, బొమ్మలరామారం మండల అధ్యక్షులు బూడిద శ్రీనాథ్ గౌడ్, ఆలేరు మండల అధ్యక్షులు చింతపండు వెంకటేష్, గుండాల మండల అధ్యక్షులు సూరిగాల రమేష్, అడ్డగూడూరు మండల అధ్యక్షులు డప్పు యాదగిరి, తుర్కపల్లి మండల రైతు విభాగం అధ్యక్షులు కృష్ణమూర్తి, మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు బన్సీ నాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్ లోజన్ నాయక్, ఆలేరు టౌన్ ప్రెసిడెంట్ రవి ముదిరాజ్, బొమ్మలరామారం మండల కార్యదర్శి రాములు గౌడ్, గుండాల మండల నాయకులు సోమల్లు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి :: యువ ఫిలిం మేకర్లను అభినందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Teenmar MalannaBC Rajyadhikara YatraBC Rajyadhikara YatraTeenmar MallannaTelangana Rajyadhikara PartyTRP PartyBhuvanagiri NewsYadadri BhuvanagiriKomirishetti NarsimhuluBC Political EmpowermentSocial Justice TelanganaTelangana Politics

About the author

T

T Ramanjaneyulu

Chief Editor

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

38 Posts

Latest News

యువ ఫిలిం మేకర్లను అభినందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చిన్నారి ఈషా రాజ్ జన్మదిన వేడుకల్లో హరిత సందేశం ఇద్దరు కల్నల్స్ భార్యలతో ఎఫైర్.. మేజర్‌పై వేటుకు సిద్ధమైన ఆర్మీ! దుర్గా యూత్ ఆధ్వర్యంలో ఘనంగా మహా అన్నదానం భక్తులకు అన్నప్రసాదం అందించిన సర్పంచ్ నారగాని రాంబాయి జగన్నాధపురంలో ఎల్‌నినో ప్రభావంపై అవగాహన సదస్సు కేఫ్‌ మజాలో ధరలపై ఆరోపణలు! భూమి శిస్తుపై మంత్రి పొంగులేటి ప్రకటనతో రైతుల్లో ఆందోళన జిమ్ తర్వాత ఖరీదైన ప్రొటీన్ పౌడర్లు అవసరం లేదు.. ఇవే బెస్ట్ ఫుడ్స్! షుగర్ ఉన్నవారు ఉపవాసం చేయొచ్చా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! చిన్నారుల్లో నాలుగు రెట్లు పెరిగిన ఊబకాయం.. 17 కోట్ల మందికి పైగా బాధ!