ఆస్ట్రేలియా NRI సెల్ తెలుగుదేశం పార్టీ నూతన కమిటీ ఎన్నిక: అధ్యక్షురాలిగా వీరపనేని వాణి

మెల్బోర్న్ / అమరావతి:
ఆస్ట్రేలియాలోని తెలుగుదేశం పార్టీ (TDP) NRI విభాగ నూతన కార్యవర్గాన్ని ఘనంగా ఎన్నుకున్నారు. వినుకొండ మాజీ శాసనసభ్యులు ఏలమందరావు కుమార్తె వీరపనేని వాణి ఆస్ట్రేలియా టిడిపి 'NRI సెల్ ప్రెసిడెంట్' (అధ్యక్షురాలిగా) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ నూతన కమిటీ ఎన్నికతో ఆస్ట్రేలియాలోని తెలుగు ప్రజలు, టిడిపి అభిమానుల్లో నూతనోత్సాహం నెలకొంది. పార్టీ బలోపేతానికి, ఎన్ఆర్ఐ తెలుగు వారి సమస్యల పరిష్కారానికి నూతన కమిటీ కృషి చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆస్ట్రేలియా TDP NRI సెల్ నూతన కార్యవర్గం:
ప్రెసిడెంట్: వీరపనేని వాణి (వినుకొండ మాజీ ఎమ్మెల్యే ఏలమందరావు కుమార్తె)
వైస్ ప్రెసిడెంట్: డాక్టర్ శ్రీజ కొత్తపల్లి
జనరల్ సెక్రెటరీ: శ్రీకాంత్ కాకుమాను
ట్రెజరర్: మనోజ్ మల్ల
కల్చరల్ సెక్రెటరీ: కవిత మద్దిపాటి
ఆర్గనైజింగ్ సెక్రెటరీ: కళ్యాణ్ గంగినేని
మీడియా సెక్రెటరీ: అనుదీప్ కోయ
వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు
నూతనంగా ఎన్నికైన అధ్యక్షురాలు వీరపనేని వాణితో పాటు కార్యవర్గ సభ్యులందరికీ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఆస్ట్రేలియాలోని ఎన్ఆర్ఐ తెలుగు అభిమానులు మరియు శ్రేయోభిలాషులు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇదీ చదవండి :: Mangalagiri Mayor: మంగళగిరి మేయర్ పీఠంపై దశరథ బాబు ఆశలు.. టీడీపీ అధిష్టానం పరిశీలన?










